- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈదురు గాలులతో కూడిన వర్షం
మందమర్రి పట్టణంలో ఉరుములు , మెరుపులతో ఆదివారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురు గాలులతో కూడిన భారీ వడగళ్ల వర్షం పట్టణాన్ని ముంచెత్తింది.

దిశ, మందమర్రి : మందమర్రి పట్టణంలో ఉరుములు , మెరుపులతో ఆదివారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురు గాలులతో కూడిన భారీ వడగళ్ల వర్షం పట్టణాన్ని ముంచెత్తింది. అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దొర్ల బంగ్లా నుంచి సీఇఆర్ వరకు సమీపంలో ఈదురుగాలుల ధాటికి ఒక భారీ వృక్షం విరిగాయి. ఓ చోట చెట్టు విరిగి విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్‌పై పడింది. దీంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. విద్యుత్ శాఖ అధికారులు రంగంలోకి దిగి పునరుద్ధరణ పనులు చేపట్టాల్సి ఉంది. మరో చోట చెట్టు విరిగి రోడ్డుకు అడ్డంగా పడటంతో రహదారికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక పోలీసులు, మున్సిపల్ సిబ్బంది చెట్టును తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేయాలని, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకొని అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు






