ఓటు కోసం మీ ఇంటికి వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయండి

by Ratna Kumari |

దిశ‌, మంద‌మ‌ర్రి : ఓటు కోసం మీ ఇంటికి వ‌చ్చే కాంగ్రెస్ నాయ‌కుల‌ను నిల‌దీయండి అని చెన్నూర్ నియోజ‌క‌వ‌ర్గం ఇన్ చార్జీ రాజా ర‌మేష్ పేర్కొన్నారు. చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, జిల్లా

ఓటు కోసం మీ ఇంటికి వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయండి
X

దిశ‌, మంద‌మ‌ర్రి : ఓటు కోసం మీ ఇంటికి వ‌చ్చే కాంగ్రెస్ నాయ‌కుల‌ను నిల‌దీయండి అని చెన్నూర్ నియోజ‌క‌వ‌ర్గం ఇన్ చార్జీ రాజా ర‌మేష్ పేర్కొన్నారు. చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్య‌క్షుడు బాల్క సుమ‌న్ ఆధ్వ‌ర్యంలో మంద‌మ‌ర్రి జాతీయ ర‌హ‌దారి వ‌ద్ద నిర్వ‌హించిన కాంగ్రెస్ బాకీ కార్డు కార్య‌క్ర‌మానికి ఆయ‌న ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా రాజా ర‌మేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చి ఎన్ని గ్యారంటీల పేరుతో మోసం చేసి గ‌ద్దెనెక్కింద‌న్నారు. 22 నెలల కాంగ్రెస్ పాల‌నలో గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలు ఏ ఒక్క‌టి నెర‌వేర్చ‌లేద‌న్నారు. మ‌హిళ‌ల‌కు, విద్యార్థుల‌కు, ఒంట‌రి మ‌హిళ‌ల‌కు, రైతుల‌కు, ఆటో డ్రైవ‌ర్ల‌కు ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌కుండా ప్ర‌తీ ఒక్క‌రికీ కాంగ్రెస్ బాకీ ప‌డ్డార‌ని తెలిపారు. కేటీఆర్ ఆలోచ‌న‌తో వ‌చ్చిన కాంగ్రెస్ బాకీ కార్డులు జిల్లాలో ఉన్న కార్య‌క‌ర్త‌లు ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని కాంగ్రెస్ నాయ‌కుల‌ను చొక్కా ప‌ట్టుకొని నిల‌దీయాల‌న్నారు. చెన్నూరు నియోజకవర్గ ఓట్లతో గెలిచి మంత్రి పదవి చేపట్టిన గడ్డం వివేక్ 40000 ఉద్యోగాలు ఇస్తారని ఎన్నికలో చేసిన హామీ వారి ఇంట్లో మాత్రం మూడు ఉద్యోగాలు వచ్చాయి. ప్రతి మహిళకు 2500 అని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ తెలంగాణ లోని ప్రతి మహిళకు ఈ 22 నెలలో 55000 బాకీ పడ్డారని, కాలేజీ లో చదువుతున్న యువతికి స్కూటీ, ఆడబిడ్డల పెళ్లికి తులం బంగారం బూడిదలో పోసిన పన్నీరు అయిందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మేడిపల్లి సంపత్, ఎండి అబ్బాస్ ,కొంగల తిరుపతిరెడ్డి, బోరిగం వెంకటేష్, తోట సురేందర్,బట్టు రాజ్ కుమార్, కనకం రవీందర్ , పల్లె నర్సింహులు, మంతెన సుమన్, ముల్కల్ల రమేష్, అందే శ్రీకాంత్, బెల్లం అశోక్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story