- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్ర మంత్రి సీతక్క పై ఆరోపణలు చేయడం మానుకోవాలి : ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క పై చేస్తున్న అవాస్తవ ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అని, నిజాలు లేని ఆరోపణలు చేస్తే సహించేది లేదని నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.

దిశ, ఖానాపూర్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క పై చేస్తున్న అవాస్తవ ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అని, నిజాలు లేని ఆరోపణలు చేస్తే సహించేది లేదని నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు సెల్ ఫోన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఖానాపూర్, పెంబి, కడెం, దస్తూరాబాద్ మండలాల్లోని అంగన్వాడీ టీచర్లకు ఎమ్మెల్యే ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో గర్భిణీ స్త్రీలకు, బాలబాలికలకు పోషకాహారం అందించడంలో రాష్ట్ర మంత్రి సీతక్క ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ నాయకులు ఆదివాసీ మంత్రి సీతక్క పై అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పది సంవత్సరాలు రాష్ట్రాన్ని దోచుకున్నది టీఆర్‌ఎస్ ప్రభుత్వం అని విమర్శించారు. అందరూ వారిలాగే ఉంటారని అనుకోవడం మూర్ఖత్వమని ఎమ్మెల్యే అన్నారు. మహిళా సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ భూమేష్, వైస్ చైర్మన్ అబ్దుల్ మజీద్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దోనికేని దయానంద్, పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్ నిమ్మల రమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ రాజురా సత్యం, నాయకులు జంగిలి శంకర్, గుగ్లావత్ రాజేందర్, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.






