నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు

by Batti.Sumithra |

నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు.

నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు
X

దిశ, మంచిర్యాల : నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. మంగళవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్ష సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తులో ఉన్నకేసులు, వారెంట్ల అమలు, పోలీసు సిబ్బంది పనితీరు పై సమీక్ష సమావేశంలో చర్చించారు. కేసుల వివరాల పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. బాధితులకు సత్వర న్యాయ సేవలు అందించేందుకు న్యాయ సేవాధికారుల సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. కేసుల చేదనలో సాంకేతికతను వినియోగించాలన్నారు. గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులు, మర్డర్, ప్రాపర్టీ, చీటింగ్, దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు తదితర అంశాల పై సూచనలు చేశారు. వాటి పరిష్కారానికి సూచనలు సలహాలను అందించారు. పెండింగ్ కేసుల దర్యాప్తులను పకడ్బందీగా చేయాలన్నారు.

చోరీలకు పాల్పడే వ్యక్తుల పై హిస్టరీ సీట్లు తెరవాలన్నారు. చోరీలు జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా చూడాలన్నారు. గ్రామాలు, కాలనీలు, వ్యాపారసముదాయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్) ను గుర్తించి సంబంధిత శాఖ అధికారులతో నివారణ చర్యలు చేపట్టాలన్నారు. పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలతో పోలీసులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. పోలీసుల విధి నిర్వహణ సక్రమంగా, క్రమశిక్షణతో ఉండే విధంగా చూసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల, పెద్దపల్లి డీసీపీ ఏ.భాస్కర్, బి.రామ్ రెడ్డి, అడిషనల్ డీసీపీ అడ్మిన్ కే. శ్రీనివాస్, గోదావరిఖని, మంచిర్యాల, జైపూర్, బెల్లంపల్లి ఏసీపీ ఎం. రమేష్, ఆర్.ప్రకాష్, వెంకటేశ్వర్లు, కిరణ్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి నాగేంద్ర గౌడ్, ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాస్, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.

Next Story