వడ్డీ వ్యాపారులపై కొరడా జులిపించిన జిల్లా ఎస్పీ

by Malleboina Mahesh |   (  Updated:2025-04-23 16:50:50  IST  )

జిల్లా ప్రజలను పట్టి పీడిస్తున్న వడ్డీ వ్యాపారులపై ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం కొరడా చూపించారు.

వడ్డీ వ్యాపారులపై కొరడా జులిపించిన జిల్లా ఎస్పీ
X

దిశ, ఆదిలాబాద్: జిల్లా ప్రజలను పట్టి పీడిస్తున్న వడ్డీ వ్యాపారులపై ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం కొరడా చూపించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు స్పందించిన ఎస్పీ జిల్లా వ్యాప్తంగా 6 మండలాలలో 30 బృందాలతో ఆకస్మిక దాడులు నిర్వహించారు. దీంతో ప్రజల వద్ద అధిక వడ్డీ వసూలు చేసే వ్యాపారుల పై దాదాపు 20 కేసుల నమోదు చేసినట్లు వెల్లడించారు. ఆకస్మిక దాడులతో వడ్డీ వ్యాపారుల వద్ద గల ప్రామిసరీ నోట్లు, స్టాంప్ పేపర్స్, చెక్కులు, స్థలాల డాక్యుమెంట్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో ఆదిలాబాద్ వన్ టౌన్, టూ టౌన్, మావల, ఇచ్చోడ, బోత్, ఉట్నూరు ప్రాంతాలలో ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించి సదరు వడ్డీ వ్యాపారుల ఆయా పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. కాగా ఈ కేసులలో పూర్తి వివరాలు త్వరలో అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

Next Story