- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > సమస్యాత్మక గ్రామాలపై SP నితిక పంత్ ఫోకస్.. స్వయంగా పోలింగ్ కేంద్రాల సందర్శన
సమస్యాత్మక గ్రామాలపై SP నితిక పంత్ ఫోకస్.. స్వయంగా పోలింగ్ కేంద్రాల సందర్శన
దిశ, వాంకిడి : సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఎస్పీ నితిక పంత్ పోలీస్ అధికారులను ఆదేశించారు.

X
దిశ, వాంకిడి : సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఎస్పీ నితిక పంత్ పోలీస్ అధికారులను ఆదేశించారు. గురువారం వాంకిడి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఆమె సందర్శించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న భద్రత ఏర్పాటును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అనుచిత కార్యకలాపాలు, గుంపులుగా తిరగడం, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అవకాశాలు ఉంటాయని అన్నారు. ఈ సమస్యలు తలెత్తేకుండా పటిష్ట భద్రత చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రానికి చుట్టు పక్కల 100 మీటర్ల వరకు నలుగురు వ్యక్తులకు మించి ఉండవద్దని.. నిబంధనలు పాటించకుంటే కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ ఆదేశించారు.
Next Story






