ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతుల ఆందోళన

by Muthe.Rajitha |

ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ రైతుల నేడు కూడా ఆందోళనలు కొనసాగిస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతుల ఆందోళన
X

దిశ, వెబ్ డెస్క్ : ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ రైతుల నేడు కూడా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. సోమవారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్‌లో అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. సోయా పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. NAFED, మార్క్‌ఫెడ్ అధికారులు రంగు మారిందని, తేమ ఎక్కువగా ఉందని చెబుతూ పంటను తిరస్కరిస్తున్నారని రైతులు ఆరోపించారు. వర్షాల కారణంగా దిగుబడి తగ్గడంతో పాటు కొనుగోళ్లు ఆలస్యం కావడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోందని, క్వింటాల్‌కు రూ.1000 వరకు నష్టం వస్తోందని వాపోయారు.

ఈ క్రమంలో పత్తి వాహనాలను అడ్డుకుని మార్కెట్‌లో కొనుగోళ్లను నిలిపివేశారు. బేల మండలంలో రైతులు మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. గత కొన్ని నెలలుగా బజార్‌హత్నూర్, బేల, ఇచోడా మండలాల్లో రాస్తారోకోలు, బంద్‌లు జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గిరిజన రైతులు ఎక్కువగా నష్టపోతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.

Next Story