త్యాగశీలి సోనియమ్మకు జన్మదిన శుభాకాంక్షలు: గజేందర్

by Dishanational1 |
త్యాగశీలి సోనియమ్మకు జన్మదిన శుభాకాంక్షలు: గజేందర్
X

దిశ, బోథ్: తెలంగాణ ప్రదాత ఏఐసీసీ అగ్రనేత యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా బోథ్ నియోజకవర్గ కేంద్రంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం ఎదుట టపాసులు కాల్చి, కేక్ కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నియోజకవర్గ ఇన్చార్జ్ ఆడే గజేంధర్ మాట్లాడుతూ ప్రతిపక్షాలను, మిత్రపక్షాలను ఒప్పించి తెలంగాణ అమరుల త్యాగాన్ని బలిదానాల్ని చూసి శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేశారని, సోనియాగాంధీకి తెలంగాణ సమాజం రుణపడి ఉందని, రాబోవు ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరవేసి సోనియాగాంధీకి బహుమతి అందజేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో బోత్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రపూల్చంధర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్, ప్రధాన కార్యదర్శి ఇట్టేడి రాజిరెడ్డి, స్థానిక ఎంపీటీసీ సభ్యుడు షేక్ నాజర్ అహ్మద్, పట్టణ అధ్యక్షుడు సల్ల రవి, సీనియర్ నాయకులు గూడాల శేఖర్, గంగాధర్, గంగారెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు జక్క భాపురెడ్డి, మండల అధికార ప్రతినిధి ఎండీ అబ్రార్, మైనార్టీ సెల్ నియోజకవర్గం అధ్యక్షులు ముస్తఫా, ఎస్సీ సెల్ నియోజకవర్గ చైర్మన్ లక్ష్మణ్, సోనాల గ్రామ అధ్యక్షుడు చెట్లపల్లి అనిల్, మండల పరిధిలోని అన్ని గ్రామాల అధ్యక్షులు, బూత్ ఎన్రోలర్స్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed