మ‌ద్యం మ‌త్తులో తండ్రిని చంపిన త‌న‌యుడు..!

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, జ‌న్నారం : మ‌ద్యం మ‌త్తులో క‌న్న తండ్రిని కుమారుడు హ‌త్య చేసిన గ‌ట‌న జ‌న్నారం మండ‌ల కేంద్రంలో చోటు చేసుకుంది. ల‌క్షెట్టిపేట సీఐ ర‌మ‌ణ‌మూర్తి, జ‌న్నారం

మ‌ద్యం మ‌త్తులో తండ్రిని చంపిన త‌న‌యుడు..!
X

దిశ‌, జ‌న్నారం : మ‌ద్యం మ‌త్తులో క‌న్న తండ్రిని కుమారుడు హ‌త్య చేసిన గ‌ట‌న జ‌న్నారం మండ‌ల కేంద్రంలో చోటు చేసుకుంది. ల‌క్షెట్టిపేట సీఐ ర‌మ‌ణ‌మూర్తి, జ‌న్నారం ఎస్సై అనూష వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. మండ‌లంలోని జ‌న్నారం గ్రామ‌పంచాయ‌తీ ప‌రిధిలోని సేవాదాస్ న‌గ‌ర్ కి చెందిన జాద‌వ్ శంక‌ర్ నాయ‌క్(50) వ్య‌వ‌సాయం చేస్తూ జీవ‌నం సాగిస్తున్నాడు. అత‌ని కుమారుడు జాద‌వ్ నూర్ సింగ్(30) మ‌ద్యానికి బానిసై రోజు తాగి కుటుంబ స‌భ్యుల‌తో గొడ‌వ‌ప‌డుతుండేవాడు. ఈ క్ర‌మంలోనే నూర్ సింగ్ మ‌ద్యానికి బానిస కావ‌డం.. త‌రుచూ గొడ‌వ ప‌డుతుండటంతో ఆయ‌న భార్య‌, పిల్ల‌ల‌తో క‌లిసి పుట్టింటికి వెళ్లిపోయింది. నిత్యం మ‌ద్యం సేవించి రావ‌డం.. తండ్రి శంక‌ర్ నాయ‌క్ ని డ‌బ్బులు ఇవ్వాల‌ని వేధించేవాడు. శ‌నివారం నూర్ సింగ్ మ‌ద్యం మ‌త్తులో తండ్రితో గొడ‌వ ప‌డ్డాడు. మాట మాట పెరిగి మ‌ద్యం మ‌త్తులో తండ్రిని త‌ల వెనుక భాగం పై బ‌లంగా కొట్ట‌డంతో అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. స్థానికులు, బంధువులు వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని విచార‌ణ చేప‌ట్టారు. కూతురు భూక్య జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌డుతున్న‌ట్టు తెలిపారు. మృతుడు శంక‌ర్ నాయ‌క్ కి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు క‌ల‌రు. క‌న్న తండ్రినే చంపిన కొడుకు ఉంటే ఏంది..? లేకుంటే ఏంది అని చ‌ర్చించుకోవ‌డం గ‌మ‌నార్హం.

Next Story