- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిప్రిలో విషాదం.. పిడుగుపడి 6గురు మృతి
ప్రకృతి కోపానికి తండ్రి, కూతురుతో పాటుగా గ్రామంలో మరో నలుగురు మృతి చెందారు. పిడుగుపాటుకు గురై 6గురు మృతి చెందిన ఘటన గురువారం గాదిగూడ మండలంలోని పిప్రి గ్రామంలో చోటు చేసుకుంది.

దిశ, ఉట్నూర్ : ప్రకృతి కోపానికి తండ్రి, కూతురుతో పాటుగా గ్రామంలో మరో నలుగురు మృతి చెందారు. పిడుగుపాటుకు గురై 6గురు మృతి చెందిన ఘటన గురువారం గాదిగూడ మండలంలోని పిప్రి గ్రామంలో చోటు చేసుకుంది. ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి పెందుర్ మనోహర్ (49), మృతుని కూతురు పెందుర్ సంజన (15), గ్రామానికి చెందిన సిడాం రంభ బాయి, భీం బాయి తో పాటుగా మరో 5గురు కూలీలు గురువారం వ్యవసాయ పనులకు వెళ్లారు.
పనులు చేస్తున్న సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్న సమయంలో తలదాచుకునేందుకు చేనులో ఉన్న చిన్నపాటి గుడిసెలోకి అందరూ వెళ్ళారు. అప్పుడే ఒక్కసారి గుడిసె పై పిడుగు పడింది. ఈ ప్రమాదంలో సిడాం రంభ బాయి, భీం బాయి, పెందుర్ మనోహర్, పెందుర్ సంజన లు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. పిడుగుపాటు ప్రమాదంలో గాయపడ్డ వారిని వెంటనే 108కి సమాచారం అందించి అదిలాబాద్ రిమ్స్ తరలిస్తున్న సమయంలో మరో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇరు కుటుంబాల్లో విషాదచాయలు..
గత రెండు రోజుల నుండి జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. గురువారం సైతం జిల్లాలోని ఆయా మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్న సమయంలో పిడుగుపాటుకు గురై మృతి చెందుతున్నారు. గాడిగుడాలోని పిప్రిలో పిడుగుపాటుకు గురై 6గురు మృతి చెందడం వల్ల గ్రామంలో ఇరు కుటుంబ సభ్యులు రోదనలు అందరిని కలచివేశాయి. అందరూ ఒకే గ్రామం కావడంతో ఎక్కడా చూసిన కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. ఈ ప్రమాదంలో తండ్రి, కూతురు మృతి చెందడంపై అందరూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఏ నోట విన్న అయ్యో పాపం అంటూ విలపించిన దృశ్యాలతో కనిపిస్తున్నాయి.






