అవినీతిని పక్కదారి పట్టించేందుకు సిట్

by Ratna Kumari |

ఫోన్ టాపింగ్ కేసులో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ను సిట్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, నడిపెల్లి దివాకర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు.

అవినీతిని పక్కదారి పట్టించేందుకు సిట్
X

దిశ, మంచిర్యాల : ఫోన్ టాపింగ్ కేసులో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ను సిట్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, నడిపెల్లి దివాకర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. ఆదివారం మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గం లో బీఆర్ఎస్ కార్యకర్తలతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఆందోళన చేపట్టారు. ర్యాలీ నిర్వహిస్తూ పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వంపై నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిని పక్కదారి పట్టించేందుకు సిట్ పేరిట బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు మోపెందుకు కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధం లేని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను సాక్షుల పేరిట పిలిచి ప్రతిష్టకు భంగం కలిగించిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ పేరిట బీఆర్ఎస్ పై బురదజల్లే ప్రయత్నాలను మానుకోవాలని హెచ్చరించారు. మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం చట్ట విరుద్ధమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉండడం వంటి కపట నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలు మరువలేదన్నారు. విచారణ పేరుతో బీఆర్ఎస్ ను బదనాం చేయాలని చూస్తే సహించేది లేద‌న్నారు.

Next Story