- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, ఖానాపూర్: రాఖీ కట్టడానికి వచ్చిన అక్క.. అనంతలోకాలకు వెళ్లిపోయింది. ఆనందంగా తమ్మునికి రాఖీ కట్టక ముందే కాటికి బయలుదేరింది.కానీ నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని దిలవార్పూర్ గ్రామాల్లోని తమ్మునికి రాఖీ కట్టడానికి వచ్చి అక్క మృతి చెందడంతో ఆగ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఖానాపూర్ ఎస్ ఐ లింబాద్రి తెలిపినా వివరాలకై నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చాందా మండలంలోని వడ్యాల్ గ్రామానికి చెందిన రాళ్ల బండి చిన్నమ్మ (70) దిల్వార్పూర్ గ్రామంలో ఉన్న తన తమ్ముడు రసమల్ల బద్దయ్యకి రాఖీ కట్టడానికి ఆదివారం దిల్వార్పూర్ గ్రామానికి వచ్చింది. సోమవారం రోజున ఉదయం వృద్ధురాలు చిన్నమ్మ గ్రామ శివారులో ఉన్న సదర్మాట్ కెనాల్ వైపు కాలకృత్యాల కోసమని వెళ్లగా.. ప్రమాదవశత్తు కాలుజారి కెనాల్ లో పడిపోయింది అని ఎస్ ఐ తెలిపారు. ఆమె తమ్ముడు గ్రామస్తులతో వెతుకుతుండగా పాత ఎల్లాపూర్ గ్రామ శివారులో గల సైఫన్ గేటు వద్ద ఆమె మృతదేహం లభించిందని, మృతురాలికి ముగ్గురు కుమారులు కాగా ఒక కొడుకు చనిపోగా, ఒక కొడుకు విదేశాలలో ఉంటున్నాడు. అని ప్రస్తుతం తన రెండవ కొడుకు రాళ్ల బండి ముత్తన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఖానాపూర్ ఎస్ఐ లింబాద్రి తెలిపినారు.
Next Story






