- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sirpur MLA : అటవీ అధికారులను సస్పెండ్ చేయాలి
సిర్పూర్ టౌన్, రేంజ్ అధికారి, సెక్షన్ అధికారులను వెంటనే సస్పెండ్

దిశ, బెజ్జూర్ : సిర్పూర్ టౌన్, రేంజ్ అధికారి, సెక్షన్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. 48 గంటల్లోగా సస్పెండ్ చేయకపోతే సిర్పూర్ టి కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేస్తానని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు హెచ్చరించారు. సిర్పూర్ టి గ్రామపంచాయతీలో బెంగాలీ క్యాంపులో అటవీ కేసుల వలన జైలు పాలైన బాధిత కుటుంబాలను బుధవారం ఎమ్మెల్యే పరామర్శించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీష్ బాబు మాట్లాడుతూ సిర్పూర్ నియోజకవర్గంలో అటవీ అధికారులు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ దుర్మార్గుల్లాగా ప్రవర్తిస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. 48 గంటల్లో థర్డ్ డిగ్రీ ప్రయోగించిన అటవీ అధికారులపై చర్యలు తీసుకోకపోతే, కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. అటవీ అధికారులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర అటవీ మంత్రి సురేఖ, ప్రిన్సిపల్ సేఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు ఎలుమల శంకర్, మల్లయ్య, కొండేటి నాని, నేరెళ్ల అశోక్, తదితరులు పాల్గొన్నారు.






