- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుని మృతి
by Batti.Sumithra |
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో విధి నిర్వహణలో కాంట్రాక్ట్ కార్మికుడు ప్రాణాలుకోల్పోయాడు.

X
దిశ, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో విధి నిర్వహణలో కాంట్రాక్ట్ కార్మికుడు ప్రాణాలుకోల్పోయాడు. డోజర్ రిపేర్ చేస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఎలుకపల్లి మోహన్ అనే మెకానిక్ కు తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన అధికారులు, తోటి కార్మికులు మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో డాక్టర్ లు మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ కు పంపించారు. కాగా కార్మికుడు చికిత్స పొందుతూ మరణించినట్టు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టినట్లు తెలిపారు.
Next Story






