చెరువులో పడి సింగరేణి రిటైర్డ్ కార్మికుడు ఆత్మహత్య

by Nallavelli.Anjaneyulu |

దిశ, తాండూర్ : మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన పెద్దింటి ప్రభాకర్(64) అనే సింగరేణి రిటైర్డ్ కార్మికుడు చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్

చెరువులో పడి సింగరేణి రిటైర్డ్ కార్మికుడు ఆత్మహత్య
X

దిశ, తాండూర్ : మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన పెద్దింటి ప్రభాకర్(64) అనే సింగరేణి రిటైర్డ్ కార్మికుడు చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ప్రభాకర్ మద్యానికి బానిస కావడంతో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో మనస్థాపానికి గురై కొత్తపల్లి గ్రామ సమీపంలోని చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతునికి భార్య రాజేశ్వరి, ఇద్దరు కొడుకులు, కుమార్తె ఉన్నారని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Next Story