- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘనంగా SGF జిల్లా స్థాయి చెస్ పోటీలు ప్రారంభం
by Ratna Kumari |
దిశ, తాండూర్ : మండల కేంద్రంలోని విద్యా భారతి ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో ఆదివారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ -14, 17 బాల బాలికలు జిల్లా స్థాయి

X
దిశ, తాండూర్ : మండల కేంద్రంలోని విద్యా భారతి ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో ఆదివారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ -14, 17 బాల బాలికలు జిల్లా స్థాయి చెస్ క్రీడాకారుల ఎంపిక పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన దాదాపు 250 క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. కార్యక్రమంలో పోటీల కన్వీనర్, పాఠశాల డైరెక్టర్ సురభి శరత్ కుమార్, పాఠశాల అకాడమీ డైరెక్టర్ సౌమ్య, జిల్లా ఎస్ జి ఎఫ్ సెక్రటరీ ఎండి యాకూబ్, ప్రిన్సిపాల్ సరోజినీ, పోటీల చెస్ ఆర్బిటర్స్ సమ్మయ్య, అకాష్, కార్తీక్, అబ్జర్వర్ పాశం శ్రీనివాస్, నిర్వాహక కార్యదర్శులు బాలకృష్ణ, రాజు, తారీకేశ్వేరి వ్యాయామ ఉపాధ్యాయులు రాజమోహమ్మద్, వహీదా బేగం, విశాల, వామన్ హరీష్ పాల్గొన్నారు.
Next Story






