- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పక్షం రోజుల్లో డీసీసీ అధ్యక్షుల ఎంపిక.. ఏఐసీసీ అబ్జర్వర్ దూత నరేష్ కుమార్
దిశ, మంచిర్యాల : పక్షం రోజుల్లో డీసీసీ అధ్యక్షుల ఎంపిక ఉంటుందని ఏఐసీసీ అబ్జర్వర్ దూత నరేష్ కుమార్ తెలిపారు. సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమంలో

దిశ, మంచిర్యాల : పక్షం రోజుల్లో డీసీసీ అధ్యక్షుల ఎంపిక ఉంటుందని ఏఐసీసీ అబ్జర్వర్ దూత నరేష్ కుమార్ తెలిపారు. సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం మంచిర్యాల కేంద్రంలోని నార్తిన్ హోటల్ లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఏఐసీసీ అబ్జర్వర్ డాక్టర్ నరేష్ కుమార్. ఈ సందర్భంగా అబ్జర్వర్ నరేష్ మాట్లాడుతూ మంచిర్యాల డీసీసీ పదవీ కొరకు మంచిర్యాల జిల్లా నుంచి 28 మంది అప్లికేషన్స్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ అప్లికేషన్స్ ఇచ్చిన వారితో నేను ముఖాముఖి మాట్లాడడం జరిగిందని చెప్పారు. అనంతరం ఈ అప్లికేషనులను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే , అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ వేణుగోపాల్, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ మీనాక్షి, నటరాజన్ తో సమావేశం చేసిన 15 రోజుల తరువాత మంచిర్యాల డీసీసీ అధ్యక్షులు పదవి ఖరారు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అబ్సర్వర్ అడువాల జ్యోతి , పీసీసీ అబ్సర్వర్ డా, పులి అనిల్ కుమార్ , శ్రీనివాస్ గారు పీసీసీ కో ఆర్డినేటర్ మరియు జిల్లా, బ్లాక్, మండల, పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






