ప్రకృతి అందాలను తిలకిస్తుంటే మనసు పులకరిస్తోంది

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, మామ‌డ : అది ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంతం.. మ‌ధ్య‌లో చెరువు. ప‌క్షుల కిల‌కిల రాగాలు. ఇలాంటి ప్ర‌కృతి అందాల‌ను తిల‌కిస్తుంటే మ‌న‌స్సు పుల‌క‌రించి పోతుంద‌ని సంద‌ర్శ‌కులు పేర్కొంటున్నారు. ఆదివారం మండ‌లంలోని

ప్రకృతి అందాలను తిలకిస్తుంటే మనసు పులకరిస్తోంది
X

దిశ‌, మామ‌డ : అది ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంతం.. మ‌ధ్య‌లో చెరువు. ప‌క్షుల కిల‌కిల రాగాలు. ఇలాంటి ప్ర‌కృతి అందాల‌ను తిల‌కిస్తుంటే మ‌న‌స్సు పుల‌క‌రించి పోతుంద‌ని సంద‌ర్శ‌కులు పేర్కొంటున్నారు. ఆదివారం మండ‌లంలోని న‌ల్దుర్తి గ్రామ స‌మీపంలోని తుర్కం చెరువును హైద‌రాబాద్ కు చెందిన నేచ‌ర్ ఇన్ నేచ‌ర్ ఎన్జీవో స‌భ్యులు ఇత‌ర సంద‌ర్శ‌కులు సంద‌ర్శించారు. చెరువు ప్రాంతంలో తిరిగే వివిధ ర‌కాల ప‌క్షుల‌ను త‌మ కెమెరాల్లో బంధించారు. అలాగే దిమ్మ‌దుర్తి అడ‌వి ప్రాంతంలోని భీమ‌న్న గుడిని సంద‌ర్శించి విశిష్ట‌త గురించి ఎఫ్ఆర్వో శ్రీనివాస‌రావు అడిగి తెలుసుకున్నారు. తుర్కం చెరువు ఎకో టూరిజంకు ఎంపిక కావ‌డం ప‌ట్ల శ‌ని, ఆదివారాల్లో వివిధ ప్రాంతాల నుంచి సంద‌ర్శ‌కులు వ‌స్తుంటార‌ని పేర్కొన్నారు. ఎఫ్ఎస్ఓ, ఎఫ్బీవో పాల్గొన్నారు.

Next Story