- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం సభకు ముమ్మర ఏర్పాట్లు.. పిప్పిరి గ్రామంలో భద్రత కట్టుదిట్టం
మండలంలోని పిప్పిరి గ్రామంలో ఈ నెల 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరం గా కొనసాగుతున్నాయి.

దిశ, బజార్‌హత్నూర్: మండలంలోని పిప్పిరి గ్రామంలో ఈ నెల 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరం గా కొనసాగుతున్నాయి. సభ విజయవంతం కోసం అధికార యంత్రాంగం అన్ని విభాగాలతో సమన్వయం చేస్తూ వేగంగా పనులు పూర్తి చేస్తుంది. సభా ప్రాంగణంలో వేదిక నిర్మాణం, పార్కింగ్ సౌకర్యాలు, రోడ్ల సమతలీకరణ, తాగునీరు, విద్యుత్ వంటి ప్రాథమిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. భారీ జనసందోహం రానున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. భద్రతా పరంగా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా స్థాయి ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. శుక్రవారం బాంబ్ స్క్వాడ్ బృందాలు సభా ప్రాంగణం పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టాయి. అదేవిధంగా ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణం చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రతి క్షణం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ప్రజల రాకపోకలను సులభతరం చేయడానికి మార్గదర్శక బోర్డులు, వాలంటీర్లను కూడా నియమిస్తున్నారు. ఈ సభకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున, అన్ని శాఖలు అప్రమత్తంగా పనిచేస్తూ ఏర్పాట్లను తుదిదశకు తీసుకెళ్తున్నాయి.






