ఓవర్‌ టేకింగ్‌కు నో చెప్పండి: డీజీపీ

by Kodari Anjali |

టోల్ ప్లాజా వద్ద హెవీ డ్రైవర్లకు ఫస్ట్ ఎయిడ్ కిట్స్ డీజీపీ పంపిణీ చేశారు.

ఓవర్‌ టేకింగ్‌కు నో చెప్పండి: డీజీపీ
X

దిశ, ప్రతినిధి నిర్మల్: రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణ భద్రతను పెంపొందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న “అరైవ్ - అలైవ్” కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి హెవీ వాహన డ్రైవర్లకు ఫస్ట్ ఎయిడ్ కిట్లను పంపిణీ చేశారు. అదేవిధంగా వారి వాహనాలపై "అరైవ్ - అలైవ్" రేడియం స్టిక్కర్లను ఆయనే స్వయంగా అతికించి పలు సూచనలు చేశారు. రోడ్డు ప్రమాదాల సమయంలో తక్షణ సహాయం అందించేందుకు ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఎంతో ఉపయోగపడతాయని, ప్రతి డ్రైవర్ రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఓవర్ టేక్ చేయకూడదని, ప్రతి వాహన దారుడు లెఫ్ట్ సైడ్ లోనే వాహనం నడపాలని డీజీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల, భైంసా ఏ ఎస్పీ రాజేష్ మీనా నిర్మల్ ఏ ఎస్పీ సాయి కిరణ్ జిల్లా పోలీసు అధికారులు,సిబ్బంది, హెవీ వాహన డ్రైవర్లు పాల్గొన్నారు.

Next Story