- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెల్లంపల్లి లో… జోరుగా కల్తీ నూనె విక్రయాలు
దీపం నూనె పేరుతో కల్తీ నూనె విక్రయాలు బెల్లంపల్లి పట్టణంలో జోరుగా సాగుతున్నాయి.

దిశ, మంచిర్యాల: దీపం నూనె పేరుతో కల్తీ నూనె విక్రయాలు బెల్లంపల్లి పట్టణంలో జోరుగా సాగుతున్నాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఓల్డ్ జిఎం ఆఫీస్ దగ్గర హోల్ సేల్ కిరాణా షాపు వ్యాపారి దీపం నూనె పేరుతో కల్తీ నూనె విక్రయిస్తున్నాడని సమాచారం మేరకు శుక్రవారం బెల్లంపల్లి మున్సిపల్ ఎన్విరాన్మెంట్ అధికారి జవాన్లతో కలిసి కిరాణా షాపులో తనిఖీ నిర్వహించారు. డ్రమ్ములో నుంచి పైపు ద్వారా ఆయిల్ తీసి అమ్ముతున్నట్లు గుర్తించారు. నూనె డ్రమ్మును షాప్ బయటికి తీసుకువచ్చారు. వాహనం తెప్పించి మున్సిపల్ కార్యాలయానికి తరలిస్తున్నట్లు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కిరాణా షాప్ లో పలువురు స్థానికులు నూనె కొనడానికి వెళ్ళగా డ్రమ్ములో నుండి తీసిన లీటరు నూనెకు రూ.160 ధరకు విక్రయిస్తున్నట్లు తెలిపారు.
గత కొద్ది రోజులుగా శ్రావణమాసం నుంచి గణపతి నవరాత్రి, దుర్గామాత పండుగలు రావడంతో హోల్ సేల్ కిరాణా వ్యాపారి కల్తీ నూనెను సామాన్య ప్రజలకు అంట కడుతూ సొమ్ము చేసుకుంటున్నాడని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. తనిఖీ చేసిన మున్సిపల్ శాఖ అధికారుల్లో ఓ అధికారి కిరాణా షాపు యజమానికి పరిచయం ఉండడంతో నామమాత్రపు తనిఖీ నిర్వహించి అక్కడినుండి వెళ్ళిపోయినట్లు సమాచారం. బెల్లంపల్లి లో కొన్ని కిరాణా షాపుల్లో వ్యాపారులు గణపతి నవరాత్రి, దుర్గామాత పండుగలను పురస్కరించుకొని దీపం నూనె పేరుతో కల్తీ నూనె విక్రయాలకు ఒడిగట్టినట్టు పట్టణంలో చర్చ నడుస్తోంది. ఈ దాడిలో ఇంచార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ సునీల్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ సంతోష్, జవాన్లు రామస్వామి, సిబ్బంది ఉన్నారు.
మున్సిపల్ కమిషనర్ కమిషనర్ వివరణ
దీపం నూనె పేరుతో లక్ష్మి నరసింహ ట్రేడర్స్ హోల్ సేల్ షాపులో తనిఖీ చేసిన విషయంపై బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ ను వివరణ కోరగా షాప్ లో కవర్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు వాటితో పాటు కొబ్బరికాయల విషయం తన దృష్టికి వచ్చిందని మార్కెట్లో ఉన్న రేటు ప్రకారమే అమ్ముతున్నాడని తెలిపారు. కల్తీ నూనె విషయం పై తెలుసుకుంటానని అన్నారు. పూర్తి సమాచారం కొరకు ఇన్చార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ సునీల్ కు ఫోన్ ద్వారా సమాచారం కోరగా కల్తీ నూనె డ్రమ్మును షాపు నుండి తీసి పక్కన ఉన్న ఓ ఇంటి వద్ద ఉంచినట్లు, మున్సిపల్ వాహనంలో కార్యాలయానికి తరలించి శాంపిల్ కోసం నూనెను పంపిస్తామంటూ మాట దాటవేశాడు.






