- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Runa Mafi : బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వద్ద రైతుల ఆందోళన ..
మండలంలోని పొన్కల్ గ్రామంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర

దిశ,మామడ : మండలంలోని పొన్కల్ గ్రామంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వద్ద రైతులు ఆందోళనకు దిగారు.సోమవారం గ్రామానికి వచ్చిన వ్యవసాయ అధికారి ,ఏఈఓ లకు తమ గోడును విన్నవించుకోగా వారు మేనేజర్ వద్దకెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సమస్య మహారాష్ట్ర బ్యాంకులో మాత్రమే వచ్చిందన్నారు. బ్యాంకు వారు పంపిన లిస్టును బయట అతికించాలని రైతులు డిమాండ్ చేశారు .ఇటీవల ముఖ్యమంత్రి రుణమాఫీ చేయడంతో ఈ బ్యాంకులోనే రూ.లక్ష రూపాయలు తీసుకున్న రైతులకు రూ. 60,000 రూ.30,000,రూ. 20,000 ఇలా రావడంతో రైతులు బ్యాంకుకు వచ్చి మేనేజర్ ను నిలదీశారు. మీరు ఎలాంటి ఇబ్బందులకు గురి కావద్దని ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామన్నారు .సాంకేతిక లోపం వల్లనే ఇలా జరిగిందని మేనేజర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామంతో పాటు చుట్టుపక్కల 10 గ్రామాల రైతులు, ఖాతాదారులు పాల్గొన్నారు.






