సర్కారీ కొలువు.. ప్రైవేటు దందా: నిబంధనలు బేఖాతర్!

by Naga Rani Yarlagadda |

వ్యక్తిగత అవసరాల కోసం వాడాల్సిన వైట్ కలర్ నంబర్ ప్లేట్ కార్లు, వాహనాలను కమర్షియల్ వాహనాలుగా రోడ్లపై తప్పుతున్నారు.

సర్కారీ కొలువు.. ప్రైవేటు దందా: నిబంధనలు బేఖాతర్!
X

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలోని ప్రైవేట్ వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ప్రైవేటు వాహనాలు కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించాల్సిన తెలుపు కలర్ నంబర్ ప్లేట్ ఉన్న తుఫాన్, కార్లు, ట్రాక్టర్లు వాహనాలను కమర్షియల్ వాహనాలుగా యథేచ్ఛగా రోడ్లపై తిప్పుతున్నారు. కాగా దీనిపై రవాణాశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. అదేవిధంగా పన్నులు చెల్లిస్తున్న ఎల్లో ప్లేట్ వాహన యజమానులు తీవ్రంగా నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైట్ ప్లేట్ వాహనాల్లో ప్రయాణిస్తే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులకు బీమా సైతం వర్తించదని అధికారులు చెబుతున్నారు. కాగా దీనిపై సంబంధిత అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

నిబంధనలు ఉల్లంఘన

రవాణాశాఖ నిబంధనల ప్రకారం ప్రైవేటు వాహనాలను వ్యక్తిగత ప్రయోజనాలకు తప్పా అద్దె వాహనాలుగా రోడ్లపై తిప్పరాదని నిబంధనలు ఉన్నప్పటికీ కొంతమంది యజమానులు కాసులకు కక్కుర్తి వడి తిప్పడం ద్వారా ఏమైనా ప్రమాదాలు జరిగితే వాహనాల్లో ప్రయాణిస్తున్న వారికి ఇన్ఫూరెన్స్ సదుపాయం కూడా రాదు.ఆదిలాబాద్ జిల్లా నుండి హైదరాబాద్,నిజమాబాద్,మహారాష్ట్ర ప్రాంతాలకు తెలుపు రంగు నంబర్ ప్లేట్లు గల వాహనాలను తరచూ అద్దెకు తిప్పుతుండడంతో వాహనాలకు త్రైమాసిక పన్నులు చెల్లిస్తున్న యజమానులు తీవ్రంగా నష్టపోతున్నామని వారు వాపోతున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు సైతం..

ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ శాఖల్లో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులు సైతం వైట్ ప్లేట్ బోర్డ్ ఉన్న వాహనాలను వాడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్లు తెలుస్తోంది.దీనివలన ఇటు ప్రభుత్వానికి పన్నులు కట్టలేక కుటుంబాన్ని పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎల్లో ప్లేట్ వాహనదారులు వాపోతున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు తెలుపు రంగు నంబర్ ప్లేట్లతో జిల్లాలో యదేచ్ఛగా తిరుగుతున్న వాహనాలపై దృష్టి సారించి ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Next Story