Road Accident : ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. పలువురి పరిస్థితి విషమం

by Muthe.Rajitha |

ఆర్టీసీ బస్సును, లారీ ఢీకొన్న ఘటన గురువారం ఆదిలాబాద్(Adilabad) లో చోటు చేసుకుంది.

Road Accident : ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. పలువురి పరిస్థితి విషమం
X

దిశ, వెబ్ డెస్క్ : ఆర్టీసీ బస్సును, లారీ ఢీకొన్న ఘటన గురువారం ఆదిలాబాద్(Adilabad) లో చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ(Ichoda) మండలం కోకస్ మున్నూర్ సమీపంలో నిర్మల్ వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. కాగా ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డట్టు సమాచారం. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఇచ్చోడ పోలీసులు స్థానికుల సహాయంతో క్షతగాత్రులను ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కు కూడా తీవ్ర గాయాలు అయినట్టు పోలీసులు తెలిపారు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలను విశ్లేసిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story