గుడుంబా , దేశీదారు తయారీ దారులకు రూ.50వేలు జరిమానా

by Nallavelli.Anjaneyulu |

దిశ, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలం గుట్టపక్క తండా గ్రామానికి చెందిన మట్ట చందర్ సింగ్ పలుమార్లు మహరాష్ట్ర కి చెందిన దేశీదారు

గుడుంబా , దేశీదారు తయారీ దారులకు రూ.50వేలు జరిమానా
X

దిశ, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలం గుట్టపక్క తండా గ్రామానికి చెందిన మట్ట చందర్ సింగ్ పలుమార్లు మహరాష్ట్ర కి చెందిన దేశీదారు అమ్ముతూ పట్టు బడటం తో రూ. 30వేలు, అలాగే గుడిహత్నూర్ మండలం లోని ముత్నూర్ గ్రామానికి చెందిన జమున అనే మహిళ పలుమార్లు గుడుంబా తయారు చేస్తూ దొరకడంతో రూ. 20,000 జరిమానా ను సోనాల, గుడిహత్నూర్ తహసీల్దార్ లు విధించారు. అయితే సోమవారం జరిమానా ను సదరు వ్యక్తులు చలాన్ రూపం లో కట్టినట్లు ఎక్సైజ్ సీఐ జూల్ఫీకర్ అహ్మద్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా గుడుంబా గానీ, మహారాష్ట్ర కు చెందిన లిక్కర్ తీసుకు వచ్చిన మరియు అమ్మిన , కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

Next Story