- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంగన్ వాడీల పాత్ర కీలకం : సీఐటీయూ
దిశ, ఆదిలాబాద్ : గ్రామీణ ప్రాంతాల్లో అంగన్ వాడీల కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందించి మాతశిశు మరణాలను తగ్గించడంలో కీలక పాత్ర పోశిస్తున్న ఐసీడీఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా

దిశ, ఆదిలాబాద్ : గ్రామీణ ప్రాంతాల్లో అంగన్ వాడీల కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందించి మాతశిశు మరణాలను తగ్గించడంలో కీలక పాత్ర పోశిస్తున్న ఐసీడీఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని సీఐటీయూ అనుబంధ అంగన్ వాడీ యూనియన్ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి ఏఆర్ సింధు ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్అండ్ బీ విశ్రాంతి భవనం వద్ద తెలంగాణ అంగన్ వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐదవ రాష్ట్ర మహాసభలను నిర్వహించారు.రెండు రోజుల పాటు జరిగే మహాసభల్లో భాగంగా తొలి రోజు మంగళవారం మున్నూరు కాపు సంఘ భవనం నుంచి ర్యాలీ నిర్వహించారు. ప్రధాన వీధుల గుండా సభ స్థలి వరకు ర్యాలీ కొనసాగింది. ఎర్ర జెండాలు చేత పట్టుకొని అంగన్ వాడీలు ఉత్సహంగా ర్యాలీ చేపట్టారు. అనంతరం సభా స్థలిలో జాతీయ, రాష్ట్ర నాయకులు అభివాదం చేసి అంగన్ వాడీలు ఎదుర్కొంటున్న సమస్యపై ప్రసంగించారు.
ఈ సందర్భంగా అంగన్ వాడీ యూనియన్ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి ఏఆర్ సింధు మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంతాల్లో బలవర్ధకమైన ఆహారం అందించడానికి 1975లో ఐసీడీఎస్ ను ప్రారంభించారని, ఇటీవలే 50 సంవత్సరాలు సైతం పూర్తయ్యాయన్నారు. ఐసీడీఎస్ ను బలోపేతం చేయాల్సిన ప్రధాని మోదీ తన నిర్ణయాలతో ఐసీడీఎస్ వ్యవస్థను నిర్విర్యం చేసేల వ్యవహరిస్తున్నారని అన్నారు. ఐసీడీఎస్ వ్యవస్థను కాపాడటంతో పాటు అంగన్ వాడీల సమస్యల సాధనకు రాష్ట్ర మహాసభలు కేంద్ర బిందువుగా మారుతాయన్నారు.గడిచిన మూడేళ్ల కాలంలో సంఘం తరపున చేసిన పోరాటాలు, ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలు, భవిష్యత్తు కార్యచరణ ప్రకటించడం జరుగుతుందన్నారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో జాతీయ మహాసభలు పుణే కేంద్రంగా జరుగుతాయని, అక్కడి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు సాయిబాబా, పాలగుడు భాస్కర్, సచిన్, సునిత, జయలక్ష్మి, దర్శనాల మల్లేష్, కిరణ్, బండారు రవి కుమార్, బండి దత్తాత్రి, వెంకటమ్మ, అంగన్ వాడీలు పాల్గొన్నారు.






