సీఎం సభకు పటిష్ట ఏర్పాట్లు

by Batti.Sumithra |

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క బజార్హత్నూర్ మండలంలోని పిప్రి గ్రామం నుండి చేపట్టిన పీపుల్ మార్చ్ పాదయాత్ర మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 6న సీఎం రేవంత్ రెడ్డి పిప్రి గ్రామానికి రానున్నారని డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ తెలిపారు.

సీఎం సభకు పటిష్ట ఏర్పాట్లు
X

దిశ, ఆదిలాబాద్ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క బజార్హత్నూర్ మండలంలోని పిప్రి గ్రామం నుండి చేపట్టిన పీపుల్ మార్చ్ పాదయాత్ర మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 6న సీఎం రేవంత్ రెడ్డి పిప్రి గ్రామానికి రానున్నారని డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ తెలిపారు. గురువారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీ సోయం బాపురావ్, పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఈనెల 3న జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాకు రానున్నట్టు తెలిపారు. సీఎం సభ ఏర్పాట్లను మంత్రి పరిశీలించి మీడియాతో మాట్లాడనున్నట్టు వెల్లడించారు. అదే విధంగా టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సైతం ఈనెల 4న జిల్లాకు రానున్నట్టు తెలిపారు. ముందుగా ఆదిలాబాద్ లో పార్టీ శ్రేణులతో సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం పిప్రి గ్రామంలో చేపట్టే సీఎం సభ ఏర్పాట్లను ఆయన పరిశీలిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు గండ్రత్ సుజాత, సాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డి, బొరంచు శ్రీకాంత్ రెడ్డి, ఆత్మ చైర్మన్ సంతోష్ రావు తదితరులు పాల్గొన్నారు.

Next Story