వరి కొనుగోలు ఆలస్యం.. రోడ్డెక్కిన రైతులు

by Bhanu |

నిర్మల్ జిల్లా కడెం మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ వద్దనున్న ప్రధాన రహదారిపై వర్షాలకు తడిసిన వరిధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని లింగాపూర్, మల్లన్నపేట్, మాసాయిపేట్ రైతులు గురువారం ధర్నాకు దిగారు.

వరి కొనుగోలు ఆలస్యం.. రోడ్డెక్కిన రైతులు
X

దిశ, కడం : నిర్మల్ జిల్లా కడెం మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ వద్దనున్న ప్రధాన రహదారిపై వర్షాలకు తడిసిన వరిధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని లింగాపూర్, మల్లన్నపేట్, మాసాయిపేట్ రైతులు గురువారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ... నెల గడుస్తున్న పది శాతం వరి కొనుగోలు జరిగిందనిఏడు వేల వరి బస్తాలు కొనుగోలు చేశారని ఇంకా 40 వేల బస్తాలు ధాన్యం వరి కేంద్రంలో నీళ్లలో తేలాడుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. వరి కొనుగోలు కేంద్రాల్లో హమాలి కొరత ఉందన్నారు. ఒక సంచికి మూడు నుండి నాలుగు కిలోల ధాన్యం కటింగ్ చేస్తున్నారని రైతులను నట్టేట ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధించిన అధికారులు వరి కొనుగోలు కేంద్రాల్లో సందర్శించి వరి కొనుగోలు వేగవంతం చేయాలని లేకుంటే ఇండ్లను ముట్టడిస్తామని అన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మాబొజ్జు పటేల్, అధికారులు ధర్నా వద్దకు చేరుకోగా ఎమ్మెల్యేను రైతులు నిలదీసి వాగ్వాదానికి దిగారు. ధాన్యం కొనుగోల్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. రైతులకు, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రైతులు అధైర్య పడొద్దు తడిచిన ప్రతి గింజను కొంటామని హామీ ఇచ్చారు. రోడ్డుపై భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Next Story