నిబంధనలు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాల నివారణ

by Taduka Kalyani |

నిబంధనలు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమని జిల్లా ఎస్పీ నితిక పంత్ అన్నారు.

నిబంధనలు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాల నివారణ
X

దిశ, ఆసిఫాబాద్ : నిబంధనలు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమని జిల్లా ఎస్పీ నితిక పంత్ అన్నారు. అలైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఏఎస్పీ చిత్తరంజన్, డీఎస్పీ అశోక్, కళాశాల ప్రిన్సిపాల్ ప్రియదర్శిని, సీఐ బాలాజీ వరప్రసాద్ లతో కలిసి ప్రభుత్వం మెడికల్ కళాశాల విద్యార్థులకు రోడ్డు భద్రతా పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు రోడ్డు భద్రతా నిబంధనలను పాటించాలని, వాహనదారులు నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. రోడ్డు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రాణాపాయం ఏర్పడటంతో పాటు కుటుంబ సభ్యులకు తీరని నష్టం కలుగుతుందని తెలిపారు. ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అవగాహన కల్పించిన ఎస్పీ, ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాల పాటింపు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. అనంతరం రోడ్డు భద్రతా పై ప్రతిజ్ఞ చేశారు.

Next Story