మేడారం ఎన్‌హెచ్ పై రోడ్డు ప్రమాదం.. గేదెను ఢీ కొట్టిన కారు

by Jakkula.Mamatha |

మంచిర్యాల జిల్లా మేడారం ఎన్ హెచ్ 363 జాతీయ రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

మేడారం ఎన్‌హెచ్ పై రోడ్డు ప్రమాదం.. గేదెను ఢీ కొట్టిన కారు
X

దిశ, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా మేడారం ఎన్ హెచ్ 363 జాతీయ రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ నుంచి నిజామాబాద్‌కు కుటుంబ సభ్యులతో కారులో ప్రయాణిస్తున్నారు. మంచిర్యాల జిల్లా మేడారం ఐఓసీ పెట్రోల్ పంపు జాతీయ రహదారి వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. సాయంత్రం 5.30 గంటలకు గేదెలను రోడ్డు దాటించేందుకు కాపరి ప్రయత్నిస్తుండగా మంచిర్యాల వైపు వెళ్తున్న కారు ఒక్కసారిగా గేదెను ఢీకొట్టింది. కారులో బెలూన్స్ ఓపెన్ కావడంతో కారులో ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రోడ్డు భద్రత నిర్వాహకులు సంఘటన స్థలానికి చేరుకొని 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని అంబులెన్స్ లో క్షతగాత్రులను మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు.

Next Story