Big Breaking News : రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 47 మంది యాత్రికులకు తీవ్ర గాయాలు

by Muthe.Rajitha |   (  Updated:2025-01-19 12:30:02  IST  )

రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) సంభవించింది.

Big Breaking News : రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 47 మంది యాత్రికులకు తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్/ఆసిఫాబాద్ : రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) సంభవించింది. అదిలాబాద్(Adilabad) జిల్లాలో జరిగిన ఈ దారుణ ప్రమాదంలో ఇద్దరు భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 47 మంది యాత్రికులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడి హాత్నూర్ మండలం సూర్యగూడకు చెందిన 60 మంది యాత్రికులు వాహనంలో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కెరిమెరిలోని జంగుబాయి ఆలయానికి(Jangubai Temple) వెళ్తుండగా.. అదిలాబాద్ జిల్లాలోని నార్నూర్(Narnoor) మండలం మాలెపూర్ ఘాట్(Malepur Ghats) లో వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి లోయలో పడింది. వాహనంలో ప్రయాణిస్తున్న 47 మంది యాత్రికులకు తీవ్ర గాయాలు కాగా, ఇద్దరు స్పాట్ లోనే మరణించారు. మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారందరినీ రిమ్స్(Rims), ఉట్నూర్, నార్నూర్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొద్ది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

Next Story