రిమ్స్ డైరెక్ట‌ర్ నిర్ల‌క్ష్యం.. పేద‌ల‌కు త‌ప్ప‌ని ఇబ్బందులు..!

by Ratna Kumari |

దిశ, ఆదిలాబాద్ : రిమ్స్ డైరెక్టర్ నిర్లక్ష్యంతో ఆదిలాబాద్ ప్రధాన రిమ్స్ ఆసుపత్రిలో కొందరు నిరుపేద ప్రాణాలు గాలిలో కలిసిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆదిలాబాద్

రిమ్స్ డైరెక్ట‌ర్ నిర్ల‌క్ష్యం.. పేద‌ల‌కు త‌ప్ప‌ని ఇబ్బందులు..!
X

దిశ, ఆదిలాబాద్ : రిమ్స్ డైరెక్టర్ నిర్లక్ష్యంతో ఆదిలాబాద్ ప్రధాన రిమ్స్ ఆసుపత్రిలో కొందరు నిరుపేద ప్రాణాలు గాలిలో కలిసిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆదిలాబాద్ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సదల్ పూర్ గ్రామానికి చెందిన టేకం పోతుబాయి అనే మహిళ అనారోగ్యంతో ఈనెల 6 న చికిత్స కోసం రిమ్స్ ఆసుపత్రిలో చేరింది. అయితే ఆమెకు శరీరంలో ఏ సమస్య ఉందో వైద్యులకైనా తెలియాలంటే కాంటస్ట్ ఇంజక్షన్ ఇచ్చి,ఎమ్మారై తీయాలని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ప్రస్తుతం కాంటస్ట్ ఇంజక్షన్ రిమ్స్ ఆస్పత్రిలో లేదని, కుటుంబ సభ్యులకు వైద్యులు తెలియజేశారు. ఈ విషయాన్ని ముందుగా కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్న యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి సదరు ఇంజక్షన్ కోసం నేరుగా రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ ను సంప్రదించానని తెలిపారు. గత వారం రోజుల నుంచి ఇంజక్షన్ లేక రోగులు ఇబ్బందులు పడుతున్నా అందుబాటులో లేకపోవడంతో రిమ్స్ డైరెక్టర్ ఈ విషయంపై రేపు లేదా మాపు..లేదా మరో రెండు రోజుల్లో హైదరాబాద్ నుంచి వస్తుందని తెప్పిస్తున్నామని అంటున్నారే తప్ప ఇంతవరకు ఆ ఇంజక్షన్ మాత్రం రిమ్స్ కు రావడం లేదని తెలిపారు.

తిరిగి ఇంటికి వెళ్లిన రోగి,బంధువులు

దీంతో చేసేదేమి లేక రోగి బంధువులు కుటుంబ సభ్యులు 14 రోజులుగా రిమ్స్ లో ఉండి..ఇక్కడ చికిత్స ఏమి అందించడం లేదని తెలుసుకొని ఎట్టకేలకు సోమవారం ఇంటి ముఖం పట్టారు. ఇంత జరిగినా రిమ్స్ డైరెక్టర్ మాత్రం ఫోన్ లో ఎవరినో సంప్రదించినట్టే సంప్రదిస్తూ.. కాలం వెళ్లదీస్తున్నారు తప్ప కావలసిన మందులు మాత్రం తెప్పించడం లేదంటూ ధ్వజమెత్తారు. ఇక్కడున్న రిమ్స్ డైరెక్టర్ నిర్లక్ష్యంతో రిమ్స్ కు వచ్చే పేద ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతుందని విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా కలెక్టర్ పట్టించుకోని, రోగులకు సరైన వైద్యం అందించడంతోపాటు వారికి కావలసిన మందులను, ఇంజక్షన్లను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ను కోరారు. అదేవిధంగా ఈ సమస్యను వెంటనే పరిష్కారించాలని లేదంటే జిల్లా ఇన్చార్జి మంత్రి దృష్టి కూడా తీసుకెళ్తామని సామ రూపేష్ రెడ్డి హెచ్చరించారు.

Next Story