‘దిశ’ ఎఫెక్ట్.. రేషన్ షాపులు తనిఖీ చేసిన రెవెన్యూ అధికారులు

by Jakkula.Mamatha |

"రేషన్ షాపుల నిర్వహణ అస్తవ్యస్తం" అనే శీర్షికతో ఈనెల 19న ‘దిశ’ దిన పత్రికలో ప్రచురితమైన వార్తకు రెవెన్యూ అధికారులు స్పందించారు.

‘దిశ’ ఎఫెక్ట్.. రేషన్ షాపులు తనిఖీ చేసిన రెవెన్యూ అధికారులు
X

దిశ, లోకేశ్వరం: లోకేశ్వరం మండలంలో రేషన్ షాపుల నిర్వహణలో గల లోపాల గురించి "రేషన్ షాపుల నిర్వహణ అస్తవ్యస్తం" అనే శీర్షికతో ఈనెల 19న ‘దిశ’ దిన పత్రికలో ప్రచురితమైన వార్తకు రెవెన్యూ అధికారులు స్పందించారు. మండలంలోని రాయాపూర్ కాండ్లి రేషన్ షాపును శుక్రవారం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ లలిత తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి రేషన్ షాపును ఇతరులు నిర్వహించకూడదని, అలాగే గన్నీ బ్యాగుతో పాటు బియ్యాన్ని తూకం వేసి వినియోగదారులను మోసగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీలర్‌ను హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేషన్ షాపును తెరిచి ఉంచాలని సూచించారు.

Next Story