- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైబర్ మోసానికి గురైన రిటైర్డ్ ఫార్మసిస్ట్
దిశ, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఫార్మసిస్టు సైబర్ మోసానికి గురై క్రెడిట్ కార్డు నుంచి విడతల వారిగా దాదాపు రెండు లక్షల రూపాయలు మాయమైన ఘటన

దిశ, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఫార్మసిస్టు సైబర్ మోసానికి గురై క్రెడిట్ కార్డు నుంచి విడతల వారిగా దాదాపు రెండు లక్షల రూపాయలు మాయమైన ఘటన మండలంలో చోటు చేసుకుంది. బోథ్ ఎస్సై శ్రీ సాయి తెలిపిన వివరాల ప్రకారం.. బోథ్ పట్టణానికి చెందిన రిటైర్డ్ ఫార్మసిస్టు కు నవంబర్ 27న సాయంత్రం సమయంలో గుర్తు తెలియని నెంబర్ నుంచి బాధితురాలి వాట్సాప్ నెంబర్ కు కాల్ చేసి కేవైసీ అప్డేట్ చేయాలి అని క్రెడిట్ కార్డు అప్డేషన్ క్రింద ఒక లింక్ ఇచ్చారు. ఆ తర్వాత చాలా సార్లు అదే నెంబర్ నుంచి బాధితురాలి వాట్సాప్ నెంబర్ కు కాల్స్ చేస్తూ అప్డేషన్ అవుతుందంటూ మాటల్లో పెట్టి క్రెడిట్ కార్డు నంబర్ తెలుసుకున్నారు. నవంబర్ 28న క్రెడిట్ కార్డు నుంచి వరుసగా రూ. 49,502, 49,502, 49,502,30, 939,9797, 5156 రూపాయలు కట్ అయ్యాయి. మరలా నవంబర్ 29వ తేదీన 12,375 రూపాయలు కట్ కావడంతో బాధితురాలు మోసపోయానని గుర్తించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై శ్రీసాయి తెలిపారు.






