వలస కూలీలపై రెస్టారెంట్ యాజమాన్యం దాడి..!

by Disha Web Desk 20 |
వలస కూలీలపై రెస్టారెంట్ యాజమాన్యం దాడి..!
X

దిశ, మందమర్రి : వలస కూలీలపై రెస్టారెంట్ యాజమాన్యం దాడి చేసిన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగినట్టు సమాచారం. మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో ఒక రెస్టారెంట్ యాజమాన్యం వలస కూలీలను పని కోసం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే పనివారు డబ్బులు కాజేశారని ఆరోపిస్తూ హోటల్ యాజమాన్యం చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మందమర్రి శివారు హైవే రోడ్డు ఆనుకుని ఒక రెస్టారెంట్ వెలిసింది. ఇందులో వివిధ పనులు నిర్వహించేందుకు కొంతమందిని గత సంవత్సరం క్రితం పనికి కుదుర్చుకుంది.

ఇందులో ముగ్గురిని గత శుక్రవారం రెస్టారెంట్ యజమానులు గద్దరాగడిలోని వారి నివాసానికి తీసుకువెళ్లి.. సంస్థకు వెళ్లవలసిన డబ్బులు మీ ఖాతాలోకి ఎలా జమ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెయ్య చేసుకుని మొబైల్ ఫోన్‌లను లాక్కొని బ్యాంకు ఖాతాలలోనున్న లక్ష రూపాయల పైచిలుకు డబ్బులు గుంజుకున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలిసి తెలియక చేసిన తప్పులకు కూలీలు ఎవరికి చెప్పాలో తెలియక దుఃఖసాగరంలో మునిగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. పైగా ఈ విషయాన్ని ఎవరికైనా తెలిపితే మీ పై పోలీస్ కేసు పెడతానని భయభ్రాంతులకు గురి చేసినట్లు తెలుస్తోంది.

కూలీలకు నజరానాలు..

వివిధ రెస్టారెంట్లలోకి వెళ్లిన వినియోగదారులు అల్పాహారాలు, భోజనాలు చేసేందుకు టేబుల్ వద్ద కూర్చోవడం ఆ తర్వాత ఆర్డర్ల కొరకు బాయ్ (కూలీలు) రావడం షరా మామూలే. కస్టమర్ ఇచ్చిన ఆర్డర్‌ను తీసుకురావడం చివరకు డబ్బుల రసీదు తీసుకువచ్చి టేబుల్ పై పెట్టడం పరిపాటే. ఈ క్రమంలో వినియోగదారులు వారికి తోచిన డబ్బులను టిప్పు (నజరానా) ఇస్తూ ఉంటారు. కూలీల వద్ద వేలాది రూపాయల డబ్బులు ఎక్కడివి అని యాజమానులు ప్రశ్నలు కురిపించి చేయి చేసుకోవడం ఇక్కడ వివాదంగా తయారైందని చెప్పవచ్చు. చట్టాన్ని చేతిలోకి తీసుకున్న వారిలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నట్లు సమాచారం. విద్యాబుద్ధులు, తప్పు, ఒప్పులు తెలపవలసిన గురువులు వివాదానికి తెర లేపడం వెయ్యి డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.



Next Story

Most Viewed