- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ కథనానికి స్పందన.. బజార్ హత్నూర్ కే మార్కెట్ కమిటీ పగ్గాలు!
‘దిశ’ కథనంతో కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా రగిలిపోతున్నారు. ఈసారి బజార్ హత్నూర్ మార్కెట్ కమిటీకే పగ్గాలు దక్కనున్నాయి.

దిశ, బజార్ హత్నూర్ : ‘దిశ’ కథనంతో కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా రగిలిపోతున్నారు. ఈసారి బజార్ హత్నూర్ మార్కెట్ కమిటీకే పగ్గాలు దక్కనున్నాయి. ఈసారి బజార్ హత్నూర్ మండలానికే కేటాయించాలంటూ కాంగ్రెస్ శ్రేణులు గట్టిగా స్వరం వినిపించాయి. ఇటీవల ‘దిశ’ పత్రికలో ప్రచురితమైన “ఈసారి అయినా మార్కెట్ కమిటీ బజార్ హత్నూర్ కేనా?” అనే కథనం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. దీంతో స్పందించిన బజార్ హత్నూర్ మండల కాంగ్రెస్ నాయకులు సోమవారం నేరేడుగొండలోని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి ఆడే గజేందర్ నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. మార్కెట్ కమిటీ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు బజార్ హత్నూర్ కు ఒక్కసారైనా అవకాశం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో అనుభవజ్ఞులు, పార్టీకి అంకితభావంతో పని చేసే నాయకులు, రైతుల సమస్యలపై అవగాహన కలిగిన వారెందరో ఉన్నారని పేర్కొన్నారు. ఆలస్యం చేయకుండా ఈసారి మార్కెట్ కమిటీ పగ్గాలు బజార్ హత్నూర్ కు అప్పగించాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ఆడే గజేందర్ నాయకుల అభ్యర్థనను ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బజార్ హత్నూర్‌కు న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.






