- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఊరంతా ఎస్టీలే.. రిజర్వేషన్ మాత్రం 'బీసీ'
దిశ, కుబీర్ : నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని ఫకీర్ నాయక్ తండాలో మొత్తం గిరిజనులే నివాసం ఉంటారు. కానీ సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్ ని

దిశ, కుబీర్ : నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని ఫకీర్ నాయక్ తండాలో మొత్తం గిరిజనులే నివాసం ఉంటారు. కానీ సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్ ని మాత్రం బీసీ వర్గానికి కేటాయించారు. దీంతో ఆ గ్రామస్తులు ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని సబ్ కలెక్టర్, ఆర్డీవో, మండల తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో వినతి పత్రాలు సమర్పించారు. ఎస్టీ రిజర్వేషన్ కల్పించేంత వరకు పోరాడుతామని పేర్కొంటున్నారు. బీసీ వర్గానికి చెందిన వారు ఒక్కరూ కూడా లేరు.. అలాంటి సమయంలో రిజర్వేషన్ ఎలా కేటాయిస్తారని ఆశ్యర్యపోతున్నారు. బీసీ రిజర్వేషన్ కారణంగా ఎన్నికలే జరుగకుండా పోతాయని.. జనాభా ను దృష్టిలో ఉంచుకొని రిజర్వేషన్లు కేటాయించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ మార్చకపోతే అమరన నిరహార దీక్ష చేపడుతామని పేర్కొంటున్నారు గ్రామస్తులు.






