వారి కుట్ర వ‌ల్లే రిజ‌ర్వేష‌న్ అమ‌లు కాలేదు : బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్

by Ratna Kumari |

దిశ, ఆసిఫాబాద్ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర వల్లే బీసీ రిజర్వేషన్ అమలు కాలేదని బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్ ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ పై మనస్థాపంలో ఆత్మహత్య చేసుకున్న

వారి కుట్ర వ‌ల్లే రిజ‌ర్వేష‌న్ అమ‌లు కాలేదు : బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్
X

దిశ, ఆసిఫాబాద్ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర వల్లే బీసీ రిజర్వేషన్ అమలు కాలేదని బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్ ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ పై మనస్థాపంలో ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వర చారి ఆత్మహత్యను నిరసిస్తూ శనివారం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు వారిని ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల బీసీ రిజర్వేషన్ అమలు కాలేదని.. దీంతో ఈశ్వర చారి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరిని వీడి.. ఇచ్చిన మాట ప్రకారం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు.

Next Story