సమగ్ర కుటుంబ సర్వే డేటా ఆప‌రేట‌ర్ల వేత‌నాలు ఇవ్వండి

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, బోథ్ : సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా నియమించిన ప్రైవేటు డేటా ఎంట్రీ ఆపరేటర్ల వేతనాన్ని వెంటనే విడుదల చేయాలని NHRC ఆదిలాబాద్ జిల్లా వైస్ చైర్మన్ రాథోడ్ సందీప్,

సమగ్ర కుటుంబ సర్వే డేటా ఆప‌రేట‌ర్ల వేత‌నాలు ఇవ్వండి
X

దిశ‌, బోథ్ : సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా నియమించిన ప్రైవేటు డేటా ఎంట్రీ ఆపరేటర్ల వేతనాన్ని వెంటనే విడుదల చేయాలని NHRC ఆదిలాబాద్ జిల్లా వైస్ చైర్మన్ రాథోడ్ సందీప్, సర్వే డేటా ఆపరేటర్లు శనివారం నేరడిగొండ ఎంపీడీఓ శేఖర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా సమగ్ర కుటుంబ సర్వేలో పని చేసిన ప్రైవేట్ డేటా ఆపరేటర్లు మాట్లాడుతూ.. సర్వే సందర్భంగా నిరుద్యోగ యువతను ప్రైవేట్ డేటా ఆపరేటర్లుగా నియమించి ఒక్కో అప్లికేషన్ కు 30 నుంచి 35 రూపాయలు చెల్లిస్తామని అధికారుల ద్వారా హామీ ఇచ్చారని తెలిపారు. హామీపై నమ్మకంతో ఆపరేటర్లు తమ వ్యక్తిగత పనులను సైతం పక్కనపెట్టి అనేక రోజుల పాటు కష్టపడి సర్వే డేటా ఎంట్రీ పనులను పూర్తి చేసామన్నారు. సర్వే ముగిసి దాదాపు పది నెలలు గడిచినా ఇప్పటివరకు ఆపరేటర్లకు ఒక్క రూపాయి వేతనం కూడా అందలేదు. ఆపరేటర్లు పలుమార్లు జిల్లా కలెక్టర్ కు, స్థానిక ఎంపీడీవోకు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ నిధుల విడుదల పై ఎటువంటి చర్యలు కనిపించడం లేదన్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని.. రాష్ట్ర స్థాయి లో పెద్ద ఎత్తున ఆందోళన లు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో నర్సింగ్ దాస్, కృష్ణ, సర్వే లో పని చేసిన డేటా ఆపరేటర్లు ఉన్నారు.

Next Story