- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నూతన వాటర్ ట్యాంక్ నిర్మించాలని ఎంపీడీవోకు వినతి
by Jakkula.Mamatha |
దిలావర్పూర్ మండలంలోని కంజర్ గ్రామంలో శిథిలావస్థలో ఉన్న వాటర్ ట్యాంక్ తొలగించి నూతన ట్యాంక్ నిర్మించాలని గ్రామ సర్పంచ్ శేరు చందు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పాలకమండలి సభ్యులు దిలావర్పూర్ ఎంపీడీవో అరుణ రాణికి వినతిపత్రం అందజేశారు.

X
దిశ, దిలావర్పూర్: దిలావర్పూర్ మండలంలోని కంజర్ గ్రామంలో శిథిలావస్థలో ఉన్న వాటర్ ట్యాంక్ తొలగించి నూతన ట్యాంక్ నిర్మించాలని గ్రామ సర్పంచ్ శేరు చందు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పాలకమండలి సభ్యులు దిలావర్పూర్ ఎంపీడీవో అరుణ రాణికి వినతిపత్రం అందజేశారు. సర్పంచ్ శేరు చందు మాట్లాడుతూ.. కంజర్ గ్రామంలో గత 25 సంవత్సరాల క్రితం నిర్మించిన వాటర్ ట్యాంక్ శిథిలావస్థలో ఉందని, పెచ్చులు ఊడుతున్నాయని అయినప్పటికీ వేరే మార్గం లేక దానిని ఉపయోగిస్తున్నామని తెలిపారు. అది కూలిపోయే ప్రమాదంలో ఉందని చుట్టుపక్కల కుటుంబాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో సమస్యను గుర్తించి పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి నూతన ట్యాంక్ నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సంధ్యారాణి, ఉప సర్పంచ్ బరుకుంట గంగారం, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
Next Story






