- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పీక్స్‌కు చేరిన పిచ్చి.. పోలీస్ వాహనంలో యువకుల రీల్స్
సోషల్ మీడియాలో యువకుల రీల్స్ పిచ్చి రోజురోజుకు మరింత పెరిగిపోతుంది. వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు.

దిశ, ఆదిలాబాద్ : సోషల్ మీడియాలో యువకుల రీల్స్ పిచ్చి రోజురోజుకు మరింత పెరిగిపోతుంది. వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. కొంతమంది ప్రమాదకర స్టంట్స్ చేస్తుంటే.. మరి కొంతమంది చట్ట వ్యతిరేక పనులు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. తాజాగా ఆదిలాబాద్ పోలీస్ శాఖకు చెందిన ఓ ఇన్నోవా వాహనాన్ని ఉపయోగించి ఇద్దరు యువకులు రీల్స్ చేసి, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా అధికారిక వాహనంలో రీల్స్ చేయడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఈ రీల్ వైరల్ కావడంతో ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చట్టవిరుద్ధంగా అధికార వాహనంతో రీల్స్ చేసిన యువకుల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సునీల్ కుమార్ తెలిపారు. కాగా ఈ పోలీస్ వాహనం ఎవరిచ్చారనేది.. పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఈ ఇద్దరు యువకుల రీల్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. పోలీసు వాహనంతో రీల్స్ చేయడం ఏంటని పలువురు నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.






