- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గిరిజన మైనర్ బాలికపై అత్యాచారం
by Kema Shiva Kumar |
మండల పరిధిలోని తులసిపేట్ గ్రామానికి చెందిన మైనర్ బాలిక మేకల కాపరిగా జీవనం సాగిస్తుంది.

X
దిశ, పెంబి: మండల పరిధిలోని తులసిపేట్ గ్రామానికి చెందిన మైనర్ బాలిక మేకల కాపరిగా జీవనం సాగిస్తుంది. అదే గ్రామానికి చెందిన నలుగురు యువకులు గత 7,8 నెలల నుంచి అత్యాచారానికి పాల్పడినట్లు అమ్మాయి ఫిర్యాదులో తెలిపింది. అదేవిధంగా తాను 6నెలల గర్భవతినని.. అత్యాచారం చేసిన వారే గర్భ నిరోధక మాత్రలు అబార్షన్ అయ్యేలా చేశారని పోలీసులకు తెలిపింది. ఈ క్రమంలోనే మైనర్ బాలికకు మంగళవారం రాత్రి నొప్పులు రావడంతో కంగుతిన్న తల్లిదండ్రులు ఇసుకలో పిండన్ని పూడ్చి పెంబి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బుధవారం పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి పిండన్ని స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్ డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ నారాయణ నాయక్, ఎస్సై రజనీకాంత్ నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నామని తెలిపారు.
Next Story






