ప్రధాని చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఆదిలాబాద్ కలెక్టర్

by Bhanu |   (  Updated:2025-04-27 09:27:30  IST  )

దేశంలో అత్యంత వెనుకబడ్డ జిల్లాల్లో ఒకటైన ఆదిలాబాద్‌కు గర్వకారణంగా, జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమంత్రి చేతులమీదుగా అవార్డు అందుకున్న ఏకైక కలెక్టర్‌గా గుర్తింపు పొందారని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా మాజీ ఎంపీ సో. బాపురావు తెలిపారు.

ప్రధాని చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఆదిలాబాద్ కలెక్టర్
X

దిశ, ఆదిలాబాద్: దేశంలో అత్యంత వెనుకబడ్డ జిల్లాల్లో ఒకటైన ఆదిలాబాద్‌కు గర్వకారణంగా, జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమంత్రి చేతులమీదుగా అవార్డు అందుకున్న ఏకైక కలెక్టర్‌గా గుర్తింపు పొందారని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా మాజీ ఎంపీ సో. బాపురావు తెలిపారు.

ప్రగతిశీల బ్లాక్ ప్రోగ్రాం కేటగిరీలో, ఈ నెల 21న జరిగిన సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా, ప్రజాస్వామ్య పరిపాలన, ఉత్తమ జిల్లా అడ్మినిస్ట్రేషన్ విభాగంలో నార్నూర్ బ్లాక్‌కు ఆస్పిరేషనల్ అవార్డు ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా కలెక్టర్ అందుకున్నారు.

ఈ సందర్భంగా, ఆదివారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సో. బాపురావు మర్యాద పూర్వకంగా కలెక్టర్‌ను కలిసి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందించి, శుభాకాంక్షలు తెలియజేశారు.

అదిలాబాద్ జిల్లాలో అధికంగా నివసిస్తున్న ఆదివాసి గిరిజన ప్రాంతమైన నార్నూర్ మండలానికి జాతీయస్థాయిలో గుర్తింపు రావడం చాలా గర్వించదగిన విషయం అని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా జిల్లా ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తూ, సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడంలో కలెక్టర్ రాజర్షి షా నిరంతర కృషి చేసి, జిల్లాకు మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Next Story