రైల్వే అండర్ బ్రిడ్జి పనులు ప్రారంభం : ఎమ్మెల్యే

by Taduka Kalyani |

ఆదిలాబాద్ పట్టణంలోని తాంసి బస్టాండ్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ (RUB) నిర్మాణ పనులు శుక్రవారం ప్రారంభమైనట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు

రైల్వే అండర్ బ్రిడ్జి పనులు ప్రారంభం : ఎమ్మెల్యే
X

దిశ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలోని తాంసి బస్టాండ్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ (RUB) నిర్మాణ పనులు శుక్రవారం ప్రారంభమైనట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. రైల్వే శాఖ నుంచి అన్ని అనుమతులు లభించాయని, పట్టణ అభివృద్ధిలో ఇది కీలకమని పేర్కొన్నారు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న కొందరు నాయకులు పనులను అడ్డుకునేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

Next Story