మారువేషంలో పేకాట స్థావరం పై దాడి..

by Batti.Sumithra |

దుగ్నేపల్లి శివారులోని నిర్మానుష్య ప్రాంతంలో కొంతమంది పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు పేకాట స్థావరంపై దాడి నిర్వహించారు.

మారువేషంలో పేకాట స్థావరం పై దాడి..
X

దిశ, చెన్నూర్ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం దుగ్నేపల్లి శివారులోని నిర్మానుష్య ప్రాంతంలో కొంతమంది పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ ఆదేశాల మేరకు పట్టణ సీఐ బన్సీలాల్, ఎస్ఐ శ్యామ్ పటేల్‌లు మారువేషంలో పోలీసు సిబ్బందితో కలిసి పేకాట స్థావరంపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులు, దాడ జంపయ్య, మేకల రాంచందర్, గజ్జెల రజనీకాంత్, దెబ్బ హరీష్‌లను అరెస్టు చేసినట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు. మిగతా 13 మంది పంటచేనుల గుండా పారిపోయినట్లు వెల్లడించారు. పట్టుబడిన వారి వద్ద నుంచి నగదు రూ. 36,000/-, ఐదు మొబైల్ ఫోన్లు, మూడు బైకులు, 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. పారిపోయిన మిగతా నిందితులను త్వరలోనే అరెస్టు చేసి, వారి పై కూడా కేసులు నమోదు చేస్తామని సీఐ తెలిపారు.

Next Story