పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలి : ఎమ్మెల్యే పాయల్ శంకర్

by Nallavelli.Anjaneyulu |

ప్రభుత్వం ద్వార పేదలకు నాణ్యమైన వైద్యం అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు.

పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలి : ఎమ్మెల్యే పాయల్ శంకర్
X

దిశ, ఆదిలాబాద్ : ప్రభుత్వం ద్వార పేదలకు నాణ్యమైన వైద్యం అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గంలోని 33 మంది లబ్దిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణి చేశారు. పేదలకు ఆరోగ్య శ్రీ ద్వార అయిదు లక్షల నుండి పది లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. ఆచరణలో సాధ్యం కావడం లేదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు.వైద్యానికి చేస్తున్న అప్పులు ఎలా తీర్చాలో తెలియక బాధితులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.ప్రైవేటులో వైద్యం చేసుకున్న వారికి కనీసం యాభై శాతం సీఎంఆర్ఎఫ్ ద్వార అందిస్తే ఊరట కలుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల ప్రవీణ్, దయాకర్,లాలా మున్న పాల్గొన్నారు.

Next Story