రెచ్చగొట్టే ప్రకటనలు చేయకూడదు : ఎస్సై విక్రమ్

by Nallavelli.Anjaneyulu |

దిశ, నవాబుపేట : ఎన్నికల సమయంలో గ్రామాలలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని నవాబుపేట ఎస్ఐ విక్రమ్ కోరారు. గ్రామాలలో శాంతి భద్రతలకు

రెచ్చగొట్టే ప్రకటనలు చేయకూడదు : ఎస్సై విక్రమ్
X

దిశ, నవాబుపేట : ఎన్నికల సమయంలో గ్రామాలలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని నవాబుపేట ఎస్ఐ విక్రమ్ కోరారు. గ్రామాలలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసుకునేందుకు ప్రజలందరూ దోహదపడాలని ఆయన కోరారు. వాట్సాప్ ,ఫేస్బుక్, ఇన్ స్టాగ్రామ్, మొదలైన సోషల్ మీడియా వేదికల్లో ఒక వర్గం మీద మరొక వర్గం రెచ్చగొట్టే ద్వేషపూరిత పోస్టులు పెట్టకూడదని,వర్గ వైషమ్యాలు రేకెత్తించే వాక్యాలు చేయకూడదని, అలాంటి వీడియోలు షేర్ చేయకూడదని ఎస్సై తెలిపారు. అలాంటి వాటిని షేర్ చేసినా, గ్రూపులలో పెట్టినా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా అలాంటి వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అదే విధంగా వాట్సాప్ గ్రూపులలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే ఆ గ్రూప్ ల అడ్మిన్లపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయం చాలా సంక్లిష్టమైనదని అందువల్ల శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రజలు తమకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Next Story