ప‌శువుల దాహార్థిని తీర్చేందుకు నీటి తొట్టెలు ఏర్పాటు

by Nallavelli.Anjaneyulu |

తాంసి మండ‌లం క‌ప్ప‌ర్ల గ్రామ‌పంచాయ‌తీలో వేస‌విలో ప‌శువుల దాహార్తిని తీర్చేందుకు రెండు నీటి తొట్టెలు నిర్మించిన‌ట్టు స‌ర్పంచ్ గండ్ర‌త్ అరుణ్ పేర్కొన్నారు.

ప‌శువుల దాహార్థిని తీర్చేందుకు నీటి తొట్టెలు ఏర్పాటు
X

దిశ‌, భీంపూర్ : తాంసి మండ‌లం క‌ప్ప‌ర్ల గ్రామ‌పంచాయ‌తీలో వేస‌విలో ప‌శువుల దాహార్తిని తీర్చేందుకు రెండు నీటి తొట్టెలు నిర్మించిన‌ట్టు స‌ర్పంచ్ గండ్ర‌త్ అరుణ్ పేర్కొన్నారు. త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా నూత‌న ప‌శువుల తొట్టెను ప్రారంభించారు. పంచాయతీ కార్యదర్శి నరేష్‌తో కలిసి కార్మికులను సన్మానించారు. అంతకు ముందు పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. గ్రామ అభివృద్ధి పనులను వివరిస్తూ, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, తడి, పొడి చెత్తను వేర్వేరుగా బండ్లలో పెట్టాలని గ్రామస్తులకు సూచించారు. "జన్మదిన సందర్భంగా కార్మికుల సన్మానం చేయడం సంతోషంగా ఉంది" అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ కౌడల నారాయణ, మాజీ ఎంపీటీసీ కౌడాల సంతోష్, మాజీ సర్పంచులు సదానందం, పులి నారాయణలతో వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Next Story