- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన మంత్రికి నిరసనలు తప్పవు : బాల్కసుమన్
దిశ, చెన్నూర్ : అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన మంత్రి వివేకా కు తగిన సమాధానం చెబుతామని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మంచిర్యాల

దిశ, చెన్నూర్ : అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన మంత్రి వివేకా కు తగిన సమాధానం చెబుతామని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పేర్కొన్నారు. గతంలో ముంపు గ్రామాల రైతులకు నష్టం వాటిల్లకుండా కరకట్టలు నిర్మిస్తామని హామీలు ఇచ్చి రైతులను మోసం చేసిన మంత్రికి తగిన గుణపాఠం చెప్పే విధంగా ముంపు గ్రామాలలో పాదయాత్ర, పల్లెనిద్ర కార్యక్రమాలు చేపడతామన్నారు. స్థానిక సమస్యల పరిష్కరించడంలో విఫలమైనoదుకు స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు వేలాది మందితో మహాధర్నా నిర్వహించి గతంలో నిర్మాణంలో ఉన్న పనులను పూర్తి చేసే విధంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. మంచిర్యాల చెన్నూరు పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు విజయం సాధించడానికి ఎన్నో అబద్ధపు హామీలు చెప్పిన మంత్రి వివేక్ రెండు సంవత్సరాలు గడిచిన ఏం అభివృద్ధి చేశారో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసున్నారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 53 కోట్ల నిధులతో పట్టణ అభివృద్ధికి నిధులుమంజూరు చేయిస్తే ఇప్పటివరకు 53 కోట్లు నిధులు ఏమయ్యాయో ప్రజలకు చెప్పాలని ఆయన అన్నారు.
ఒకవైపు సంక్షేమం లేదు, మరోవైపు అభివృద్ధి లేదు ఎన్నికల ముందు ఫ్యాక్టరీ నిర్మించి నిరుద్యోగులకు 45 వేల ఉద్యోగాలు కల్పిస్తానని అబద్ధపు హామీలు ఇచ్చి నెరవేర్చకుండా, తన కుటుంబంలో మాత్రం ముగ్గురికి ఉద్యోగాలు సంపాదించుకున్నాడు అని ఆయన అన్నారు. ఒకవైపు అక్రమ ఇసుక, మరోవైపు ఇందిరమ్మ ఇండ్లలో అవకతవకలు జరుగుతున్నప్పటికీ ఏమి తెలియనట్లు నటిస్తున్నాడని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల ముందు 420 అబద్ధపు హామీలు ఇచ్చి ఇప్పటివరకు నెరవేర్చడంలో విఫలమయ్యారని, ఫుట్బాల్ మ్యాచ్ ల కోసం వందల కోట్లు ఖర్చు పెట్టె కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అభివృద్ధి కోసం ఎందుకు ఖర్చు పెట్టడం లేదో సమాధానం చెప్పాలని అని అన్నారు ఒకవైపు బస్సు చార్జీలు పెంచి మరోవైపు ఉచిత బస్సు పథకము అమల్లోకి తెచ్చామని నాటకాలు ఆడుతున్నారని ఆయన అన్నారు. నియోజకవర్గంలో 102 గ్రామపంచాయతీలో జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కి తగిన బుద్ధి చెప్పి బిఆర్ఎస్ పార్టీ బలపరిచే సర్పంచులను, వార్డ్ మెంబర్లను గెలిపించాలని ఆయన కోరారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్యం, డబ్బులతో గ్రామాలలో ఓటర్లను ప్రలోభానికి గురి చేస్తున్నారని ఆయన ప్రజలు వారిని నమ్మడం లేదని ఆయన అన్నారు. చెన్నూరు నియోజకవర్గం లో అభివృద్ధి కుంటుపడిందని గతంలో టిఆర్ఎస్ పాలనలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మినీ స్టేడియం, మహిళా భవనము, 100 పడకల ఆసుపత్రి, బస్సు డిపో నిర్మాణం ఇప్పటివరకు ప్రారంభానికి నోచుకోలేదని, చిరు వ్యాపారులు రోడ్లపై కూరగాయల వ్యాపారాన్ని కొనసాగిస్తు నానా అవస్థలు పడుతున్నప్పటికీ మంత్రి పట్టించుకోవడంలేదని అన్నారు. మంత్రి వివేకు కు చిత్తశుద్ధి ఉంటే టిఆర్ఎస్ పార్టీ పాలనలోనే జరిగిన అభివృద్ధి తప్ప గత రెండు సంవత్సరాల నుండి నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి చేశారో ప్రజలకు వివరించాలని ఆయన అన్నారు. ఇకనుండి ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన మంత్రికి కళ్ళు తెరిచే విధంగా పోరాటాలు చేస్తామని ఆయన అన్నారు.






