తిర్యాణి PHC ని 30 ప‌డ‌క‌ల ఆసుప‌త్రిగా కొనసాగించాలి : బీజేపీ

by Nallavelli.Anjaneyulu |

దిశ, తాండూర్ : తిర్యాణి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రి గానే కొనసాగించాలని మండల బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.

తిర్యాణి PHC ని 30 ప‌డ‌క‌ల ఆసుప‌త్రిగా కొనసాగించాలి : బీజేపీ
X

దిశ, తాండూర్ : తిర్యాణి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రి గానే కొనసాగించాలని మండల బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం బీజేపీఆధ్వర్యంలో PHC ఎదుట నాయకులు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు ర‌మేష్ గౌడ్ మాట్లాడుతూ 30 పడకలుగా ఉన్న PHC ని 15 పడకల ఆస్పత్రిగా కుదించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. తిర్యాణి మండలంలో 90 శాతం మంది గిరిజనులే జీవనం కొనసాగిస్తారని అన్నారు. PHC ని 15 పడకల ఆసుపత్రిగా మారిస్తే గిరిజనులకు అన్యాయం చేసినట్లే అని విమర్శించారు. మారుమూల ప్రాంతాల్లో నివసించే గిరిజనులు ఇప్పుడిప్పుడే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి వైద్య సేవలు పొందుతున్నారని పేర్కొన్నారు. అత్యంత వెనుకబడిన గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం మరిన్ని వైద్య పరికరాలు ఏర్పాటు, వైద్యులు, సిబ్బందిని నియమించకుండా PHC ని కుదించడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి PHC 15 పడకల ఆసుపత్రిగా కుదించడాని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలోబీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు తిరుపతి, సీతారాం, భాస్కర్, అరుణ్ గౌడ్, బారిక్ రావు, శంకర్, కుమార్, భీరావు, విజయ్, దౌలవత్ రావు పాల్గొన్నారు.

Next Story